1 . ఒక దేశంలోని వస్తు,సేవల ఉత్పత్తి విలువను ఏమంటారు ?
Ans : జాతీయ ఆదాయం
2 . మన దేశంలో మొదటిసారిగా స్వాతంత్య్రానికి ముందు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన భారతీయుడు ఎవరు ?
Ans : దాదాభాయ్ నౌరోజీ
3 .భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏది ?
Ans : CSO (Central Statistics Office )
4 . జాతీయ ఆదాయాన్ని లెక్కించే ముందు CSO ప్రామాణికంగా తీసుకునే సంవత్సరాన్ని ఏమని అంటారు ?
Ans : Base Year
5 .2015 జనవరిలో 2011 -12 ను Base Year గా ఏ కమిటీ సిపార్సుల మేరకు ప్రకటించారు ?
Ans : K .సుందరం కమిటీ
6 . భారత జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి అవలంబించే పద్ధతి ఏమిటి ?
Ans :ఆదాయ మదింపు పద్ధతి
7 . మన దేశంలో ప్రాధమిక రంగంలో ఉత్పత్తి అయ్యే జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతి ద్వారా అంచనా వేస్తారు ?
Ans : ఉత్పత్తి మదింపు పద్ధతి
8 .జాతీయ ఆదాయాన్ని మన దేశంలో శాస్త్రీయం గా మొదట అంచనా వేసినది ?
Ans : VKRV రావు
9 . 1949 లో నియమించబడిన జాతీయాదాయ కమిటీ అధ్యక్షుడు ?
Ans : మహల్ నోబిస్
10 . కేంద్ర గణాంక సంస్థ (CSO ) ను స్థాపించిన సంవత్సరం ?
Ans : 1951
11 . ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ పౌరులచే తయారుచేయబడిన అంతిమ వస్తు సేవల స్థూల విలువ ?
Ans : స్థూల జాతీయోత్పత్తి
12 . తలసరి ఆదాయం ఎలా తెలుసుకుంటాము ?
Ans : జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా తో భాగించాలి
13 .స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదల తొలగిస్తే దానిని ఏమంటారు ?
Ans :నికర జాతీయోత్పత్తి
14 .మానవ అభివృద్ధి సూచీలను ప్రతి సంవత్సరం ప్రకటించేది ఎవరు ?
Ans : UNDP (United Nations Development Programme )
15 . మానవ అభివృద్ధి సూచీని మొదటగా రూపొందించింది ఎవరు ?
Ans : మహబూబ్ ఉల్ హక్
16 .భారతదేశ జాతీయాదాయం లో అత్యధిక భాగం ఏ రంగం నుండి లభిస్తుంది ?
Ans : తృతీయ రంగం
17 ."Poverty and Un-British Rule in India " అనే గ్రంధంను రచించిన జాతీయవాది ఎవరు?
Ans : దాదాభాయ్ నౌరోజీ
18 .భారతదేశంలో ఇప్పటివరకు ప్రకటించబడిన మొత్తం Base years సంఖ్య ?
Ans : 8
19 .జాతీయ అంచనాల కమిటీ ఏ సంవత్సరాన్ని మొదటిసారి Base year గా ప్రకటించినది ?
Ans : 1948 -49
20 .భారతదేశం లో జాతీయ ఆదాయాన్ని లెక్కించుటకు ఏ ఏ పద్దతులను ఎక్కువగా ఉపయోగిస్తారు ?
Ans : ఉత్పత్తి మదింపు పద్దతి మరియు ఆదాయ మదింపు పద్ధతి
0 comments:
Post a Comment